Thursday, April 25, 2024

బిగ్ బాస్ హౌస్ లో గుంటనక్క అతనే…

తెలుగు అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఐదో వారం లోకి ఎంటర్ అయింది. నాలుగో వారంలో నట్రాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గుంట నక్క గురించి చెప్పాడు. నట్రాజ్ మాస్టర్ ఎలిమినేట్ అని చెప్పగానే లోబో, యానీ, హమీదా గుక్కపెట్టి ఏడ్చేశారు. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ కూడా చాలా ఎమోష‌న‌ల్ అవుతూ హౌజ్‌ని వీడాడు.

అనంతరం స్టేజీ మీదకు వచ్చిన నటరాజ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తన భార్య‌కు నా అవ‌స‌రం ఉందేమో, అందుకే దేవుడు తనను ఆమె దగ్గరికి పంపిస్తున్నాడ‌ని చెప్పాడు. ఈ సందర్భంగా నాగార్జున… న‌టరాజ్ మాస్టర్‌కు జంతువులు అంటే ఎక్కువ ఇష్టమని, కంటెస్టెంట్లను జంతువులతో పోల్చమని టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో ఉన్న గుంటనక్క గురించి కూడా చెప్పాలని కోరాడు. అలా కొన్ని జంతువుల పేర్లు ఉన్న బోర్డును తెప్పించాడు. సిరి పాములాంటిదని, తన జోలికి వస్తేనే కాటు వేస్తుంది.. లేదంటే తన పని తాను చేసుకుంటుందని చెప్పాడు.

లోబో ఎలుక‌లా మొత్తం తినేస్తాడ‌ని అన్నాడు. విశ్వ ఊస‌రవెల్లి, శ్రీరామచంద్ర మొసలిలాంటి వాడని, ప్రియాంక సింగ్‌.. అందరికీ ప్రేమతో వడ్డించే చిలక అని తెలిపాడు. సింహం.. తానేనన్న నటరాజ్‌.. మానస్‌ గాడిదలా ఎప్పుడు క‌ష్ట‌ప‌డుతూనే ఉంటాడ‌ని తెలిపాడు. ఇక చివర్లో గుంటనక్క ఎవరో చెప్పుకుండా, రవి ఫోటోను గుంట నక్క బొమ్మ కింద పెట్టాడు. అందరికంటే ఎక్కువ తెలివి ఉంటుందని, కానీ అందరి విషయాల్లో తొంగి చూస్తాడు అని నటరాజ్ చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement