Thursday, April 25, 2024

భూమికి ముప్పు తప్పినట్టేనా?.. గ్ర‌హ‌శ‌క‌లాన్ని ఢీకొట్టిన నాసా స్పేస్‌క్రాఫ్ట్‌

ఫుట్​ స్టేడియం అంత పెద్ద సైజులో ఉండే (డైమార్ఫస్) ఓ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోంది. ఇది కనుకు భూమిని తాకితే అంతా వినాశనమే అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు అయితే.. ఇట్లాంటి ఉల్కలను అడ్డుకునేందుకు నాసా (అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ) ఓ స్పెషల్​ మిషన్​ని చేపట్టింది. గత ఏడాది నవంబర్​లో స్పేస్​ ఎక్స్​ రాకెట్​ ద్వారా డార్ట్​ (DART) స్పేస్​ క్రాఫ్ట్​ ఇప్పుడు అంతరిక్ష గ్రహశకలాల పనిపడుతోంది. అందులో భాగంగా నిన్న రాత్రి 7 గంటలకు భూమివైపు దూసుకొస్తున్న డైమార్పస్​ ఉల్కని హైపర్​సోనిక్​ వేగంతో ఢీకొట్టింది.

ఇక.. ఈ ప్రయోగంపై నాసా సంతోషం వ్యక్తం చేస్తోంది. సుమారు రూ.2500 కోట్ల విలువైన డార్ట్ (డీఏఆర్‌టీ) స్పేస్‌క్రాఫ్ట్‌.. గంటకు 22,50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ గ్రహశకలాన్ని ఢీకొట్టినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు వెల్లడించారు. భవిష్యత్తులో భూమి వైపు దూసుకొచ్చే గ్రహశకలాలను నాశనం చేసే ఉద్దేశంతో ఈ ప్రయోగం చేపట్టినట్టు నాసా తెలిపింది. అయితే.. ఈ అతిపెద్ద ఉల్కను ఢీకొట్టడం జరిగింది..

కానీ, దాని పరిణామం ఇప్పుడే తెలియదని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే.. ఈ ప్రయోగం అనుకున్న ప్రభావాన్ని సాధించిందా లేదా అనేది వచ్చే నెలలో గ్రహశకలం తదుపరి భూ-ఆధారిత టెలిస్కోప్ పరిశీలనల వరకు తెలియదు. కానీ, నాసా అధికారులు మాత్రం ఈ పరీక్ష విజయవంతమైందని ప్రశంసిస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. భవిష్యత్తులో భూమివైపు దూసుకొచ్చే ప్రమాదకర గ్రహశకలాలను అంతరిక్షంలోనే పక్కకు మళ్లించవచ్చనేది శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement