Friday, April 19, 2024

5జీ టెక్నాల‌జీతో – ఢిల్లీ నుంచి యూర‌ప్ లోని కారుని టెస్ట్ డ్రైవ్ చేసిన ప్ర‌ధాన మోడీ

5జీ టెక్నాల‌జీతో ఢిల్లీ నుంచి యూర‌ప్ లోని కారును ప్ర‌ధాని మోడీ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నార‌ని తెలిపారు కేంద్ర మంత్రి పియూశ్ గోయల్.కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీ సహాయంతో ఆయన ఎరిక్సన్ స్టాల్‌లో ఈ ఫీట్ చేశారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శనివారం ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఎరిక్సన్ స్టాల్‌లో రూపుదిద్దుకున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. స్వయంగా కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన చిత్రాలను పోస్టు చేశారు. భారత్ ప్రపంచాన్ని నడుపుతున్నదని పేర్కొంటూ ఈ ఫొటో ఆయన ట్వీట్ చేశారు. యూరప్‌లోని స్వీడన్‌లో ఓ ఇండోర్ కోర్స్‌లో ఈ వాహనాన్ని ఉంచారు. దాన్ని నావిగేట్ చేయడనికి కంట్రోల్ సెటప్‌ను ఢిల్లీలోని ఎరిక్సన్ స్టాల్‌లో ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ ఆ సీటు పై కూర్చుని ఎదురుగా ఉన్న హ్యాండిల్‌ను, యాక్సెలేటర్, బ్రేక్‌లను యూజ్ చేస్తూ కారును డ్రైవ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement