Wednesday, April 24, 2024

Education: స్టూడెంట్స్​ని ఆగంజేస్తున్న ‘నారాయణ’.. కుంట్లూరు క్యాంపస్​ వద్ద రచ్చ రచ్చ!

నారాయణ విద్యా సంస్థల మోసం మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. కాలేజీలో స్టూడెంట్స‌ని చేర్చుకునే మందు విశాలంగా ఉన్న కాలేజీ ఆవ‌ర‌ణ‌, చూడ్డానికి అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండే గ‌దుల‌ను చూపించి అడ్మిషన్లు తీసుకున్నారు. తీరా స్టూడెంట్స్ ల‌క్ష‌లాది రూపాయ‌ల ఫీజులు క‌ట్టి జాయిన్ అయిన త‌ర్వాత వారిని సిటీకి దూరంగా ఉండే మ‌రో క్యాంపస్​కి త‌ర‌లించారు. దీంతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు దిగారు. ‘‘లక్షల్లో ఫీజులు వసూలు చేసి, కనీస సౌకర్యాలు లేని ప్రాంతానికి తమ పిల్లలను తీసుకెళ్తున్నారని ఇదేం పద్ధతి” అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులుండే గదుల్లో కనీస వసతులు లేవని, రాత్రివేళ తేళ్లు, ఇతర కీటకాలు వస్తుండటంతో స్టూడెంట్స్​ రాత్రంతా భయంతో వణికిపోతూ నిద్రపోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో దాదాపు 250మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కుంట్లూరు నారాయణ కాలేజీ దగ్గర ఇవ్వాల (బుధవారం) ఆందోళనకు చేపట్టారు. అడ్మిషన్​ పొందిన కాలేజీలోనే తమ పిల్లలను ఉంచాల‌ని నిరసన వ్యక్తం చేశారు. దీనికి కాలేజీ నిర్వాహకుల నుంచి సరైన రెస్పాన్స్​ లేదని, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కాలేజీ ముందు బైఠాయించినట్టు తెలుస్తోంది. చివరకు ఈ విషయంపై రాతపూర్వకం ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

అయితే.. ఈ రెండు మూడు రోజుల్లోగా తిరిగి తమ పిల్లలను పాత క్యాంపస్​ కు తీసుకొస్తేనే కాలేజీలో వేస్తామని, లేకుంటే మార్పించేస్తామని సీరియస్​గా వార్నింగ్​ ఇచ్చినట్టు సమాచారం. ఇక చేసేదేమీ లేకపోవడంతో తమ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడుతామని నిర్వాహకులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆందోళనతో దాదాపు 4 గంటలపాటు కుంట్లూరు నారాయణ క్యాంపస్​ లో ఉత్కంఠ నెలకొంది. కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement