Tuesday, April 23, 2024

కక్ష‌సాధింపుకోసమే నారాయణ అరెస్ట్ – ఎమ్మెల్సీ బిటెక్ ర‌వి

అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా వైసీపికికక్ష సాధింపు దాహం తీరలేదని,టిడిపి అధినేత‌ చంద్రబాబుకు వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేక నారాయణను అరెస్టు చేశారని టిడిపినేత.. ఎమ్మెల్సీ బిటెక్ రవి విమర్శించారు. కడపలోని గాయత్రి పవర్స్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయనమాట్లాడారు. ప్రభుత్వం ఏ తప్పు చేసినా ఆ బురద ప్రతిపక్షాలపై వేయడం పరిపాటిగా మారిందని ఈసందర్బంగా అన్నారు..ప్రభుత్వ పాఠశాలల్లో లీకైతే దానిపై ఎందుకు మంత్రి బొత్సను బాధ్యులను చేయడం లేదని ప్రశ్నించారు. బొత్సను అరెస్ట్ చేసే దమ్ముందా అని మండి పడ్డారు.ప్రజల దృష్టిని మరల్చేందుకే నారాయణ అరెస్ట్ చేశరాన్నారు.
న్యాయస్థానం ఉండటంతో కడిగిన ముత్యంలా బయటకు వచ్చారన్నారు.విలేకర్ల సమావేశంలోటిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement