Wednesday, October 30, 2024

Nara Bhuvaneshwari: ఏపీ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు.. నారా భువనేశ్వరి ఏమన్నారంటే..

ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ఆంధ్రప్రదేవ్ శాసనభలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి తనకు అండగా నిలబటం తన జీవితంలో మర్చిపోలేనని చెప్పారు.

” చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో పంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాము. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాల్లో, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరిచకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను ” అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement