Sunday, June 4, 2023

మా అక్కతో రాఘవకు అక్రమ సంబంధం: సెల్ఫీ వీడియోలో రామకృష్ణ సంచలనం విషయాలు

పాల్వంచ నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్యకు ముందో రామకృష్ణకు సంబంధించి మరో సెల్ఫీ వీడియో వెలుగుచూసింది. తన ఆత్మహత్యకు మొదటి సూత్రధారి వనమా రాఘవనే అని వీడియోలో రామకృష్ణ పేర్కొన్నారు. తన తల్లి, సోదరి అతనికి సహకరించి.. తనకు న్యాయబద్దంగా రావాల్సిన ఆస్తి వాటాను రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.  అంతేకాదు, తన సోదరి కొమ్మిశెట్టి మాధవితో రాఘవకు 20 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉందని సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఆ అక్రమ సంబంధం వల్లే ఒక కుటుంబం నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పారు.

దీనికి మధ్యవర్తిగా మా అమ్మ గారి సహకారం ఉందన్నారు.  ఈ ముగ్గురు కలిసి తండ్రి ద్వారా న్యాయబద్దంగా రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ఏడాది క్రితం పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని ఆస్తి పంపకాలకు కాగితాలు రాసుకున్నామని చెప్పారు. కానీ ఏడాది నుంచి దాన్ని పెండింగ్‌లో పెట్టి… తనను అప్పుల ఊబిలోకి నెట్టారని, తనకు చావు తప్ప వేరే మార్గం లేని పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ సంబంధం వల్ల ఒక కుటుంబం, వంశం నాశనమయ్యే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పారు. వీళ్లను ఏం చేస్తారో సమాజానికే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. తానేమీ అనవసర అభియోగాలు, ఆరోపణలు చేయట్లేదని సెల్ఫీ వీడియోలో బాధితుడు రామకృష్ణ చెప్పారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement