Friday, December 6, 2024

హాలీవుడ్ లో సినిమా తీయ‌డం నా క‌ల‌.. రాజ‌మౌళి

హాలీవుడ్ లో సినిమా తీయ‌డం త‌న క‌ల అని స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి చెప్పారు. రాజమౌళి తదుపరి సినిమా హాలీవుడ్ లోనే అనే ప్రచారం మొదలైంది.దీనికి రాజమౌళి కూడా సానుకూలంగానే స్పందించడం గమనార్హం.ప్రపంచవ్యాప్తంగా ప్రతి దర్శకుడికీ హాలీవుడ్ లో సినిమా చేయాలని ఉంటుందని, దీనికి తాను కూడా అతీతుడిని కాదన్నారు. ప్రయోగం చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. హాలీవుడ్ ఫీచర్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించాలని అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. కాకపోతే ఎక్కడ ఈ ప్రక్రియను మొదలు పెట్టాలో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో ఎవరో ఒకరితో తాను కలసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ‘ భారత్ కు తిరిగి చేరుకున్నాను. నేను డైరెక్టర్ ను. ఒక సినిమాను ఎలా తీయాలో ఎవరూ నాతో చెప్పరు. బహుశా నా మొదటి అడుగు ముందుగా ఎవరో ఒకరి సహకారం తీసుకోవడం కావచ్చొని అన్నారు. హాలీవుడ్ సినిమా తనకు ప్రతిష్టాత్మకమైన స్వప్నంగా రాజమౌళి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement