Saturday, April 20, 2024

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఇళ‌య‌రాజా-ప్ర‌మాణ స్వీకారం చేయించిన డిప్యూటీ చైర్మ‌న్

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం రాజ్య‌స‌భలో డిప్యూటీ చైర్మన్ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ ..ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజ‌తో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు. రాష్ట్రప‌తి కోటాలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఇటీవ‌లే ఇళ‌య‌రాజా ఎన్నిక‌య్యారు.ఇళ‌య‌రాజాతో పాటు తెలుగు సినీ క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, కర్ణాట‌క‌కు చెందిన సామాజిక‌వేత్త వీరేంద్ర హోగ్డే , కేర‌ళ‌కు చెందిన ప‌రుగుల రాణి పీటీ ఉష‌ల‌ను ఇటీవ‌లే కేంద్రం రాష్ట్రప‌తి కోటాలో రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. వీరిలో ఇప్ప‌టికే విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, పీటీ ఉష‌లు ప్ర‌మాణం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement