Thursday, March 28, 2024

మినీ దంగల్.. తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ షురూ

తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమయ్యింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లులతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతోంది. వీటితోపాటు మెట్‌పల్లి, అలంపూర్‌, జల్‌పల్లి, గజ్వేల్‌, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్‌లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

ఐదు మునిసిపాలిటీల పరిధిలోని 248 వార్డులకు గాను 1,307 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 11,34,032 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం మొత్తం 1539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9809 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. అవాంఛనీయ సంఘనటనలు జరుగకుండా భారీ బందోబస్సు ఏర్పాటుచేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్‌, మాస్కులు, గ్లౌసులు అందుబాటులు ఉంచారు. మే 3న ఫలితాలు వెలువడనున్నాయి.

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లలో 500 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. మొత్తం 878 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 6,53,240 మంది ఓటు వేయనున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 59 డివిజన్లు ఉండగా, 250 మంది బరిలో నిలిచారు. 373 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 2,88,929 మంది ఓటర్లు ఉన్నారు. కార్పొరేషన్‌ లో ఇప్పటికే 10 డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు.

సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు పోలింగ్‌ జరుగుతున్నది. ఇక్కడ 1,00,678 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 236 మంది పోటీచేస్తుండగా, 130 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. నకిరేకల్‌ మున్సిపాలిటీలో 20 వార్డులకుగాను 93 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 40 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 21,382 మంది ఓటువేయనున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో 27 వార్డుల్లో 112 మంది అభ్యర్థులు బరిలో నిలివగా, 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 41,515 మంది ఓట్లరు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారు. ఇక అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 66 మంది పోటీలో ఉన్నారు. 44 పోలింగ్ కేంద్రాల్లు 20,529 మంది ఓటు వేయనున్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఒమత్తం 8,136 మంది ఓటర్లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement