Saturday, May 28, 2022

ముంబైలో ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ : వైర‌ల్ గా ఎన్టీఆర్,రామ్ చ‌ర‌ణ్ ఫొటోలు

నేడు ముంబైలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ రానున్నార‌ట‌. కాగా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కించాడు. ఈ మూవీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ముంబైలోని ఫిల్మ్ సిటీలో ‘ఆర్ఆర్ఆర్’ వేడుక‌కు సిద్ధ‌మైన వేదిక, అక్క‌డ‌ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ దిగిన‌ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. అలాగే, ముంబై విమానాశ్ర‌యంలో వారిద్ద‌రు క‌లిసి దిగిన ఫొటోలు కూడా సామాజిక మాధ్య‌మాల్లో చక్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ సినిమా కోసం నిర్మాత డీవీవీ దానయ్య భారీగా ఖర్చుపెట్టారు. ఈ ఈవెంట్‌లో అలియా భట్, అజయ్ దేవగన్ కూడా పాల్గొననున్నారు. బాహుబ‌లి వంటి భారీ హిట్ అనంత‌రం రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. సంక్రాంతి ముందు విడుద‌ల కానున్న ఈ సినిమా ఏ స్థాయిలో వ‌సూళ్లు రాబ‌డుతుంద‌న్న ఆస‌క్తి నెల‌కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement