Monday, April 15, 2024

Movie: శ్రీలీలతో రవితేజ ‘ధమాకా‘!

‘ఖిలాడి‘తో హీరో రవితేజ థియేటర్లకు రావడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా విడుదల తేదీని సెట్ చేసుకుంటూ ఉండగానే రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే మూవీతో సెట్స్ పైకి వెళ్లిపోయాడు. ఆ సినిమా షూటింగు జోరుగా సాగుతుండ‌గానే నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మ‌రో మూవీని సెట్ చేసుకున్నాడు రవితేజ.

ఈ సినిమాకి ‘ధమాకా’ అనే టైటిల్ ను ఖరారు చేసి, దసరా పండుగ సందర్భంగా టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక రేపో మాపో రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగును కూడా పూర్తి చేసి రవితేజ షాక్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాలో ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల నటించనున్నట్టుగా వార్తలు వ‌స్తున్నాయి. అయితే టీనేజ్ కుర్రాడితో జోడీ కట్టిన ఆమె, ఆ వెంటనే సీనియర్ స్టార్ సరసన చేస్తుందా? అనుకున్నారు. కానీ ఆల్రెడీ పూర్తయిన షెడ్యూల్ షూటింగులో శ్రీలీల కూడా పాల్గొన్నట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement