Saturday, May 28, 2022

సినిమా ముచ్చ‌ట్లు.. ఏమున్న‌యంటే..

చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ చిత్రంలో కథానాయికగా తమన్నాను ఖరారు చేశారు. ఇందులో నటిస్తున్నందుకు తమన్నాకు పారితోషికంగా రూ.3 కోట్లు ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ పేరిట పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తన షూటింగ్ పార్టును ప్రభాస్ తాజాగా పూర్తిచేశాడు. ఈ సందర్భంగా సెట్స్ లో యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి సందడి చేశారు. ఇందులో కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న ‘మేజర్’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇందులో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ నటిస్తోంది. హీరో మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఫిబ్రవరి 11న విడుదల చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement