Thursday, April 18, 2024

Movie: “భీమ్లా నాయక్”కు అమెజాన్ బిగ్ ఆఫర్!

Bheemla Nayak: ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, దగ్గుబాటి రానా హీరోలుగా నటిస్తున్న “భీమ్లా నాయక్” సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ఎస్.ఎస్ థ‌మన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇప్పటిదాకా సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ లు, పాటలు సినిమా పై అంచనాలు మరింత పెంచాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో కనిపించనుండగా, రానా డానియల్ శేఖర్ గా కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు చిత్ర నిర్మాతలకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం.

“భీమ్లా నాయక్” సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది. అయితే అమెజాన్ మాత్రం డైరెక్ట్ గా తమ ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని పెద్ద ఆఫ‌ర్‌ చిత్ర బృందం ముందు ఉంచినట్లు తెలుస్తోంది.

డైరెక్ట్ గా ప్రైమ్ లో విడుదల చేసేటట్లయితే వారు నిర్మాతలకి 150 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమాకి వచ్చిన ఆఫర్ 50 కోట్లు కానీ, ఈ మూవీకి భారీ ఆఫర్ రావడంతో నిర్మాతలు కూడా ఆలోచనలో ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది.

మరి నిర్మాతలు డైరెక్ట్ గా ప్రైమ్ లో విడుదల చేస్తారా.. లేక కేవలం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను మాత్రమే ఇస్తారా.. అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement