Tuesday, April 23, 2024

Spl Story: మనసున్న మారాజు కేసీఆర్​.. లీడర్​షిప్​ కోసం ఎదురుచూస్తోంది భారతమాత

మనసున్న మారాజు కేసీఆర్​.. దగాపడ్డ తెలంగాణను ప్రాణాలు ఫణంగా పెట్టి ఓ దరికి చేర్చారు. తొండలు గుడ్లు పెట్టని బీడువారిన భూములకు అపర భగీరథుడై నీళ్లు పారించారు. ఒకప్పుడు గుక్కెడు నీళ్లకోసం మైళ్లకొద్దీ దూరం వెళ్లాల్సిన పరిస్థితులుండేవి. అట్లాంటిది ఇంటింటికీ నల్లాలు బిగించి రోజువారీగా కావాల్సినన్ని నీళ్లు అందిస్తున్నారు. కొత్త కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసి తెలంగాణ చుట్టుముట్టు వందలాది టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ నాలుగు అడుగులు తవ్వినా నీళ్లు లభించే పరిస్థితి.. అంతే కాకుండా ఒక్కో సామాజిక రుగ్మతలను, పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్​ రక్కసిని, చాలా కాలాంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పలు సమస్యలకు చక్కటి పరిష్కారం చూపారు. ఇంత సంతోషంగా తెలంగాణ ప్రజలు ఉన్నారంటే అది కేసీఆర్​ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పథకాల వల్లనే అన్నది విమర్శకులు సైతం ఒప్పుకుంటున్న వాస్తవం..

–‌‌ నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

తెలంగాణ అంటే.. దగాపడ్డ బతుకులు, ఆత్మహత్యలు, వలసలు.. ఇది 2013 దాకా రాష్ట్రంలో కనిపించిన చిత్రం. బోరుబాయి, బొగ్గుబాయి, బొంబాయి అన్న పరిస్థితులుండేవి. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలకు వెళ్లిన తెలంగాణ నుంచి వలసవచ్చి ఉపాధి కోసం నానా కష్టాలు పడేవారే కనిపించేది. నేషనల్​ మీడియాలో ఎన్నో సార్లు స్పెషల్​ స్టోరీస్​ కూడా వచ్చాయి. తెలంగాణలో పెద్ద పెద్ద ఆసాములు, పదుల ఎకరాల్లో భూములున్న రైతులు కూడా పొట్ట గడవని పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి కుటుంబాలను కాపాడుకున్నారు.

మరి ఇప్పుడు కంటిముందు ఉన్న తెలంగాణ అదేనా?.. గొప్ప గొప్ప మాటలు చెబుతున్న ఇతర లీడర్లకు ఇప్పుడు కనిపిస్తున్నవి పాత పరిస్థితులేనా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎట్లాంటి తెలంగాణను ఏ దిశగా మార్చిండు కేసీఆర్​ అన్నది ఇప్పుడు అందరూ మనసుపెట్టి ఆలోచించాల్సిన తరుణం వచ్చింది.

ఎందుకంటే.. దేశంలో ఎక్కడా లేని పథకాలు, అభివృద్ధి, సంక్షేమం తెలంగాణలో జరుగుతుంది కాబట్టే ఇతర రాష్ట్రాల నేతల కండ్లన్నీ తెలంగాణ మీద పడ్డయ్​.. ఇది ముమ్మాటికీ నిజం. అందుకే బాగుపడ్డ బంగారు తెలంగాణను మళ్లీ ఆగం చేసేందుకు ఒకరి తర్వాత ఒకరుగా వరుసకట్టి వచ్చి పిచ్చి కూతులు కూస్తూ… తెలంగాణ ప్రజలను, పాలకులను అవమానించేలా మాట్లాడుతున్నరు కొంతమంది లీడర్లు. దీన్ని చూస్తూ సంబురపడుతున్నారు ఇక్కడ రాజకీయ ఉపాధి, కాంట్రాక్టర్లు దక్కని ఇంకొంతమంది కుత్సిత బుద్ధిగల నాయకులు. ఇట్లాంటి కుటిల, కంపు కొట్టే రాజకీయాలు కాదు యువతకు కావాల్సింది. కులం, మతం పేరుతో భావోద్వగాలను రెచ్చగొట్టి, తాత్కాలిక పబ్బం గడుపుకునే లీడర్లు అయితే అస్సలు వద్దు. మతం మత్తులో ప్రజలను ఆలోచించకుండా జేసి, ఆగంజేయకుండా చూసుకోవాల్సిన నిఖార్సయిన దార్శనికత లీడర్​ షిప్​ కోసం ఎదురుచూస్తున్నది దేశం.

- Advertisement -

తెలంగాణలో ఏం జరిగిందంటే..

ఒంటరి మహిళలకు ఆసరాగా, పైసలిస్తే కానీ చదువు చెప్పలేని ప్రైవేటే బడులకు దీటుగా ప్రభుత్వ బడులను పెంచి ఉచిత విద్య అందించేలా.. అన్ని జిల్లాలు, మండలాల్లో ఉచిత వైద్యం అందించేలా మెరుగైన పరిస్థితులు తీసుకొచ్చారు సీఎం కేసీర్​. సామాన్యులు మంచిగ బతకాలి, కనీసం కడుపునిండా తిండి తిని, కంటినిండా నిద్ర పోవాలన్న తలంపుతో ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. పెద ఆడబిడ్డల పెండ్లికి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు మేనమామగా లక్ష రూపాయల కట్నం ఇచ్చి ఆదుకున్నారు. ఇది కులం, మతం ప్రాతిపదికన కాకుండా పేద ఆడబిడ్డలకు, పెద్దింటి ఆడబిడ్డలకూ వర్తించేలా చర్యలు తీసుకున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో సక్సెస్​ సాధించిన విషయాలున్నాయి. అయితే.. ఇవన్నీ ఇతర రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ అమలు కావడం లేదన్నది వందకు వందశాతం నిజం.

ఇంతటి దార్శనికత, ముందుచూపు, సాగునీటి రంగంలో మరో వందేండ్ల దాకా మళ్లీ మళ్లీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేపట్టిన వేగవంతమైన చర్యలు మరే ఇతర రాజకీయ నాయకుడు ఆలోచించనవి.. ఆచరణలో చూపనివి. అట్లాంటి నేత దేశ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల యావత్​ దేశమే బాగుపడుతుందనడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. అందుకే యావత్ దేశ ప్రజలు కేసీఆర్​ లీడర్​షిప్​ కోసం ఎదురు చూస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement