Thursday, March 28, 2024

Rail Accident | 200 దాటిన రైలు ప్ర‌మాద మృతులు.. కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

ఒడిశాలో జ‌రిగిన‌ ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 207మందికి చేరింది. అదే సమయంలో 900 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ అధికారికంగా ఈ వివ‌రాల‌ను ప్రకటించారు. ప్రమాదస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయ చర్యల్లో వైమానిక దళం పాల్గొంటుంది. రెస్క్యూ, ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ కోసం వైమానిక దళం సేవలు అందిస్తోంది. కోల్‌కత్తా నుంచి ఘటనా స్థలానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుని సేవలు అందిస్తోంది. అంబులెన్సులు, వైద్యబృందాల సాయంతో గాయపడినవారికి బాలేశ్వర్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.

రైలులో విజయవాడ ప్రయాణికులు..
కాగా, ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 120 మంది విజయవాడ ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా షాలిమార్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో వారి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో టోల్ ఫ్రీ నెంబర్‌కు భారీ సంఖ్యలో కాల్స్‌ వస్తున్నాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఈ ఉదయం 10 గంట‌ల‌కు విజయవాడ చేరాల్సి ఉండగా.. ఇంతలోనే ఈ ఘోరం జరుగడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement