Friday, April 19, 2024

మాన్ స్ట‌ర్ ఫ‌స్ట్ లుక్..’ల‌క్కీ సింగ్’ గా అద‌ర‌గొట్టిన మోహ‌న్ లాల్..

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ యాక్టింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నే లేదు. ఆయ‌న న‌టించిన చిత్రాలలో ఒక‌టో, రెండో త‌ప్ప మిగ‌తా అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్సే. తెలుగు ప్రేక్ష‌కుల‌కి మోహ‌న్ లాల్ సుప‌రిచితుడే. ఆయన రీసెంట్ గా మ‌రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెహన్ లాల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన ‘లక్కీ సింగ్’ అనే పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. బ్లాక్ కలర్ టీ షర్ట్ .. తలపాగా .. మెడలో ‘L’ లెటర్ ఉన్న సిల్వర్ చైన్ .. చేతిలో గన్ .. టేబుల్ పై బుల్లెట్స్ తో ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు ఈ చిత్రానికి మాన్ స్ట‌ర్ అనే టైటిల్ ని పెట్టారు. ఇది భారీ యాక్షన్ మూవీ. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. వైశాఖ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆంటోని పెరుంబవూర్ నిర్మాత‌. కాగా ఇది భారీ బడ్జెట్ సినిమా.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement