Thursday, April 25, 2024

Monsoon -రాను రానంటున్న నైరుతి … ఆల‌స్యంగా తొలక‌రి పుల‌కింత‌..

హైద‌రాబాద్ – నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు మూడు నుంచి నాలుగు రోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ శాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. నిజానికి కేరళ తీరాన్ని జూన్ 4 నాటికి రుతు పవనాలు చేరుకుంటాయని తొలుత అంచనా వేశారు. తాజా అంచనాల ప్రకారం జూన్ 7 నాటికి రుతు పవనాలు కేరళను చేరుకోనున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు రుతు పవనాల వ్యాప్తి కొనసాగుతుంటుంది.

వాతావ‌ర‌ణ శాఖ తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం – ‘‘దక్షిణ అరేబియా సముద్రంపై పశ్చిమాది గాలులు పెరుగుతుండడంతో, పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. పడమర గాలుల తీవ్రత నిన్నటి నుంచి పెరిగింది. సముద్ర ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తుకు జూన్ 4న చేరాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంపైనా మేఘాల వ్యాప్తి పెరుగుతోంది. ఈ అనుకూల పరిస్థితులతో రుతుపవనాలు వచ్చే మూడు నాలుగు రోజుల్లో మరింత పురోగమిస్తాయి’’ అని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. కాగా, 2020లో జూన్ 1న, 2021లో జూన్ 3న, 2022లో మే 29 నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి.. అయితే ఈ సారి మాత్రం ఒక వారం ఆల‌స్యంగా ప్రవేశించ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement