Saturday, January 29, 2022

మోహ‌న్ బాబు యూనివ‌ర్సిటీ – సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

న‌టుడే కాదు రాజ‌కీయాల్లో చేసిన మంచు మోహ‌న్ బాబు. కాగా శ్రీ విద్యానికేత‌న్ పేరుతో ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచు ఫ్యామిలీ విద్యా సంస్థ‌ల‌ను న‌డుపుతోన్న సంగ‌తి తెలిసిందే. కాగా మోహ‌న్ బాబు మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మోహ‌న్ బాబు యూనివ‌ర్సిటీ ప్రారంభిస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు మోహ‌న్ బాబు. ఈ మేర‌కు ట్వీట్ ని చేశారు. శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను” అంటూ మోహన్ బాబు వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement