Thursday, April 25, 2024

బుమ్రా ప్లేస్ లో మ‌హ్మ‌ద్ ష‌మీ.. బీసీసీఐ

ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో భార‌త జ‌ట్టులో మ‌హ్మ‌ద్ ష‌మీకి చోటు ద‌క్కింది. గాయంతో మెగా టోర్నీకి దూర‌మైన బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా స్థానంలో మ‌హ్మ‌ద్ ష‌మీని జ‌ట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఇదివ‌ర‌కే బార‌త జ‌ట్టు ఆస్ట్రేలియా చేరుకోగా… శుక్ర‌వారం ష‌మీ కూడా ఆస్ట్రేలియా చేరుకున్నాడ‌ని, ప్ర‌స్తుతం బ్రిస్‌బేన్ లోని భార‌త జ‌ట్టుతో అత‌డు జ‌త క‌లుస్తాడ‌ని బీసీసీఐ త‌న ప్ర‌క‌టన‌లో వెల్ల‌డించింది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఇదివర‌కు బీసీసీఐ ప్ర‌క‌టించిన జ‌ట్టులో రిజ‌ర్వ్ బెంచ్‌లో ష‌మీ ఉన్న సంగ‌తి తెలిసిందే.


ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు భార‌త జ‌ట్టు ఇదే..
రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, దీప‌క్ హూడా, రిష‌బ్ పంత్‌, దినేశ్ కార్తీక్‌, హార్దిక్ పాండ్యా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, అర్ష్‌దీప్ సింగ్‌, మ‌హ్మ‌ద్ ష‌మీలు తుది జ‌ట్టులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement