Saturday, December 9, 2023

Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. పోలీస్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో అడ్వ‌కేట్ శ్రీ‌నివాస్ విచార‌ణ‌

తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (ఫామ్ హౌస్ ఫైల్స్‌) విష‌యంలో ఇవ్వాల (సోమ‌వారం) సిట్ ఆధ్వ‌ర్యంలో ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. నిందితుల్లో ఒక‌రైన సింహ‌యాజి స్వామికి విమానం టికెట్ బుక్ చేసిన విష‌యంలో అడ్వ‌కేట్ శ్రీ‌నివాస్‌ని సిట్ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. దాదాపు ఎనిమిది గంట‌ల‌కు పైగా ఈ విచార‌ణ జ‌రుగుతుండ‌గా.. ప‌లు ప్ర‌శ్న‌లు అడిగి స‌మాధానాలు రాబ‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అక్టోబ‌ర్ 14వ తేదీన నందుతో మాట్లాడిన కాల్ రికార్డులు, డేటాని శ్రీ‌నివాస్ ముందు ఉంచి ప‌లు ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్టు స‌మాచారం. ఇక‌.. తాను సింహ‌యాజితో పూజ‌లు చేయిస్తాన‌ని, అందుకే అత‌డికి విమానం టికెట్ బుక్ చేయించిన‌ట్టు శ్రీ‌నివాస్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement