Friday, April 19, 2024

వాస్తవాలు చెప్తే నాపై నిందలు: కాంగ్రెస్ నేతల తీరుపై జగ్గారెడ్డి అసహనం

హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమితో ఆపార్టీలో ఉన్న ముసలం మరోసారి బహిర్గతం అయింది. గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కకపోవడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై సొంత పార్టీ నేతలు టార్గెట్ చేశారు. ఉపఎన్నిక ఫలితాలపై గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు మేథోమథనం చేస్తున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

హుజూరాబాద్ లో కాంగ్రెస్ తప్పిదం వల్లే భారీ ఓటమి ఎదురైందని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సూపర్ స్టార్లు హుజరాబాద్ కు వెళ్లినా ఓట్లు రాలేన్న జగ్గారెడ్డి.. తాను వెళ్తే ఓట్లు వచ్చేవా అని ప్రశ్నించారు. మానిక్కం ఠాగూర్ కు ఏమీ తెలియదన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం తనకు అలవాటు అని చెప్పారు. వాస్తవాలు చెప్తే తనపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజం చెప్తే నేరమన్నట్టుగా తప్పుపడుతున్నారని మండిపడ్డారు. ఒక్కోసారి మాట్లాకపోవడం మంచిదనిపిస్తోందన్నారు. గాంధీభవన్ లో మాట్లాడాలా ? వద్దా? అనేది తేలిపోతుందన్నారు. ఇకపై అంతర్గత వ్యవహారాలపై మాట్లాడనని చెప్పారు.

ఇది కూడా చదవండి: పార్టీలు మారే వ్య‌క్తిని కాదు.. కుట్ర‌దారుడు కుట్ర‌ల‌కు నాశ‌న‌మైపోతాడు: ఈటల

Advertisement

తాజా వార్తలు

Advertisement