Tuesday, April 23, 2024

చెరువు క‌ట్ట‌పై చెవిరెడ్డి..ప్ర‌శంసిస్తున్న ప్ర‌జ‌లు..

చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ పేరు ఇప్పుడు మారు మోగుతోంది. చిత్తూరు జిల్లాలో రాయ‌ల చెరువు నిండి లీకేజీ జ‌రిగింది. ఒక‌వేళ క‌ట్ట తెగితే దాదాపు 30గ్రామాలు నీట మునుగుతాయి. అయితే ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌ని జిల్లా అధికారులు చెరువు ప‌రిస్థితిపై ఫోక‌స్ పెట్టారు. సమీప గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. అదే సమయంలో రాయల చెరువు గురించి టెన్షన్ పడుతున్న వేళ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి చెరువు కట్టపైనే మకాం వేసారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఆదేశాల మేరకు అక్కడే ఉంటూ లీకేజీ నియంత్రణ పనులను స్వ‌యంగా పర్యవేక్షించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం అక్కడే బస చేసారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి రెండు రోజులు పూర్తిగా చెరువు కట్టపైనే గడిపారు. ఆయన బహిరంగ ప్రదేశంలోనే స్నానం చేస్తూ అందుబాటులో ఉన్న ఆహారం తీసుకున్నారు.

అక్కడే నిద్రించారు.వరద ముంపు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హమాలీగా మారి బస్తాలను మోసారు. విమానాశ్రయం నుంచి ఆర్సీపురం మండలంలోని 11 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 10 టన్నుల నిత్యావసర సరుకులు హెలికాప్టర్‌ ద్వారా వచ్చాయి. ఆ బస్తాలను చెవిరెడ్డి తన సహచరులతో కలిసి హెలికాప్టర్‌ నుంచి కిందకు దించి ముంపు బాధితులకు అందజేశారు. వరద ముంపు నేపథ్యంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదని, చెరువుకు గండి పడినా ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగకూడదనేది సీఎం జగన్‌ ఆదేశించారని ఆయన చెప్పారు. చెవిరెడ్డి తీసుకున్న చొర‌వ‌కి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement