Tuesday, March 26, 2024

Shame: ముంబైలో బాలికపై గ్యాంగ్​ రేప్​.. నిందితులిద్దరూ క్యాబ్​ డ్రైవర్లే!

ముంబైలోని ఫోర్ట్​ ఏరియాలో 15ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​ జరిగింది. అక్టోబర్​ 22న రాత్రి ఛత్రపతి శివాజీ మహరాజ్​ (CSMT) రైల్వే స్టేషన్​లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన క్యాబ్​ డ్రైవర్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని, మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు ఆఫీసర్​ స్వాతియేల్​ చెప్పారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ముంబైలోని ఫోర్ట్ ఏరియాలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై 28 ఏళ్ల క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులైన 28 ఏళ్ల క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేయగా, మరో క్యాబ్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని MRA మార్గ్ పోలీసులు తెలిపారు. కాగా, ఒక పోలీసు బృందం నిందితుడిని వెతకడానికి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లినట్టు చెప్పారు. క్యాబ్ డ్రైవర్ అక్కడికి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితుడిని అభిమన్యు హన్స్ రాజ్ స్వరోజ్ గా పోలీసులు తెలిపారు, 

బాధితురాలు రాణి (పేరు మార్చాం) అనే విద్యార్థిని మాతుంగాలోని శ్రద్ధానంద్ మహిళాశ్రమంలో నివసిస్తోంది. ఈ ఘటనపై ఎంక్వైరీకి సీనియర్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో నిందితులిద్దరి కోసం మాన్‌హాంట్ ప్రారంభించడానికి రాజేష్ పవార్ బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, అక్టోబర్ 22న రాత్రి రాణి CSMT స్టేషన్‌కు చేరుకుందని, ఆమెను ఒంటరిగా చూసి ఇద్దరు నిందితులు ఆమెను మాటల్లో దింపి వివరాలు రాబట్టారని కేసు దర్యాప్తు అధికారి స్వాతి యేల్ చెప్పారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాలికను చూసి వారు రేప్​ చేయాలని ప్లాన్ చేశారన్నారు. ముందుగా ఆమెకు సహాయం చేస్తామని నమ్మించి, స్వరోజ్, ఇతర నిందితుడు తమతో పాటు రమ్మని చెప్పారు. సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లి గ్యాంగ్​ రేప్​ చేశారు.

అయితే.. లాడ్జ్ లోకి బాలికను తీసుకెళ్లే క్రమంలో క్యాబ్ డ్రైవర్ల నుంచి లాడ్జి నిర్వాహకులు ఏదైనా ఐడెంటిటీ పేపర్లు తీసుకున్నారా? లేదా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ గ్యాంగ్​ రేప్​ వెనకాల లాడ్జి పాత్ర కూడా ఉందేమో అన్న అనుమానం కూడా ఉందని, CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. త్వరలోనే లాడ్జి యజమానిని విచారిస్తామని, స్వరోజ్‌పై రేప్​, గ్యాంగ్​ రేప్​, కిడ్నాప్, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement