Wednesday, April 24, 2024

స్పెయిన్ లో విజృంభిస్తోన్న క‌రోనా – 90వేల మ‌ర‌ణాలు

క‌రోనా విజృంభిస్తోన్న వేళ స్పెయిన్ లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 90వేల‌కి చేరింది. ఈ విష‌య‌న్ని స్పెయిన్ ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ తెలిపింది. ద‌క్షిణ ఐరోపా ఖండంలోని స్పెయిన్ లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. దాంతో భారీగా పాజిటీవ్ కేసులు న‌మోదు కావ‌డంతో పాటు మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతోంది. స్పెయిన్ దేశ వ్యాప్తంగా కోవిడ్ మరణాలు 90 వేల‌కు చేరాయని స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్ల‌డించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 202 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

స్పెయిన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 74,57,300 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా..72 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 2,92,394 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయని తెలిపింది. 23.58 శాతం మంది రోగులు ఇంటెన్సివ్ కేర్ లో చేరి చికిత్స పొందుతున్నారని..13.4 శాతం మంది బాధితులు నార్మల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న‌ాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. కేసులు పెరుగుతున్న క్రమంలో నియంత్రించే భాగంగా స్పెయిన్ ప్రభుత్వం 5 నుంచి 16 ఏళ్ల వ‌యసున్న 33,50,000 మందికి క‌రోనా టీకా వేశామని ప్ర‌ధాని పెడ్రో షాంచెజ్ తెలిపారు. క‌రోనా నివార‌ణ‌కు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement