Thursday, August 5, 2021

నిరుద్యోగులారా..నోటిఫికేషన్లు రానున్నాయి: మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇటీవల చేసిన హమాలి పని వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే..అయితే తన కామెంట్స్ పై నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు. చదువుకున్నోళ్ళందరికీ సర్కార్ ఉద్యోగం రాదని.. హమాలీ పని చేసుకోవాలని సూచించారు. అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘నా కామెంట్స్ తప్పుగా అన్వయించారని తెలిపారు. యువత మనోభావాలను దెబ్బతీసేలా తాను ఎప్పుడూ మాట్లాడలేదని, యువత ఎవరు బాధ పడవద్దని సూచించారు. చదువుకున్న నిరుద్యోగ యువత ప్రిపేర్ అవ్వండి.. నోటిఫికేషన్లు రాబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

ఇక ఏపీ-తెలంగాణ జల వివాదంపై మాట్లాడుతూ.. కేంద్రం అవసరం అయిన పని చేయకుండా, ఏక పక్షంగా గెజిట్ విడుదల చేసిందన్నారు. కేంద్రం గెజిట్ రాజ్యాంగ విరుద్ధమని, కేంద్రం గెజిట్ పై రెండు జాతీయ పార్టీలకు స్పష్టమైన వైఖరి లేదన్నారు. కృష్ణ నది జలాలపై తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు వైఖరి చెప్పాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

ఇది కూడా చదవండి : షురూ..మణిపూర్ లో మళ్లీ లాక్ డౌన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News