Wednesday, May 19, 2021

మంత్రి పువ్వాడ అజయ్‌కు రెండోసారి కరోనా పాజిటివ్

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఫస్ట్ వేవ్‌లో గత ఏడాది కరోనా బారిన పడ్డ ఆయన.. సెకండ్ వేవ్‌లో ఈ ఏడాది కూడా మరోసారి కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలతో బాధపడుతుండడంతో ఆయనకు ఏప్రిల్ 30న ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు. దీనిపై మంత్రి పువ్వాడ ట్విట్టర్‌లో స్పందించారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని శనివారం నాడు వెల్లడించారు. ప్రస్తుతం పూర్తిగా హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా ఇటీవల ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల కోసం పువ్వాడ విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. సభలు,సమావేశాలు,ర్యాలీలు నిర్వహించడంతో.. ఆ సమయంలోనే ఆయనకు కరోనా సోకి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News