Wednesday, April 24, 2024

ఈ నెల 17న క‌రీంన‌గ‌ర్ లో ప‌ర్య‌టించ‌నున్న మంత్రి కేటీఆర్ – ఏర్పాట్ల‌ని ప‌రిశీలించిన కలెక్టర్

ఈ నెల 17న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగర అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు కరీంనగర్ కు వెళ్ల‌నున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, మేయర్ సునీల్ రావు మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా మానేరు వంతెన పై వాటర్ పైలాన్ ప్రారంభంతో పాటు 24 గంటల తాగునీటి పథకాల శిలాఫలకం రివర్ ఫ్రంట్ శిలాఫలకం పనులను పరిశీలించి, సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. అనంతరము ఉజ్వల పార్క్ సమీపంలోని ఐటి పార్క్ పక్కన రూ. 5 కోట్లతో నిర్మించిన తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య మరియు శిక్షణ కేంద్రం (బిసి స్టడీ సర్కిల్) భవనాన్ని పరిశీలించారు. మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా అదే రోజు బిసి స్టడీ సర్కిల్ ను కూడా ప్రారంభించే అవకాశం ఉన్నందున మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాంనగర్ మార్క్ ఫెడ్ మైదానంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ స్థలి వేదికను కలెక్టర్ పరిశీలించారు. స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న శిలాఫలకంను కలెక్టర్ పరిశీలించారు ఏర్పాట్లన్నీ పకడ్బందీగా సకాలంలో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement