Monday, March 25, 2024

కేంద్రంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం: బీజేపీపై మంత్రి గంగుల ఫైర్

కార్మికులే సమాజానికి వెన్నెముక అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక సర్కార్ అని తెలిపారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మీక వ్యతిరేక విధానాలను ఎండ గడుతామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రవాణా రంగంలోని మోటార్ వెకిల్ చట్టంలో 714 జిఓతో ఆటో డ్రైవర్ల బతుకులను దీన వ్యవస్థలోకి నెట్టిందని మంత్రి గంగుల మండిపడ్డారు. నేడు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని బస్టాండ్ వద్ద జెండాను ఎగురవేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న 714 జీవో రద్దు అయ్యే వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  వారి పక్షాన పోరాడుతుందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల వ్యతిరేక ప్రభుత్వమని, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పెంచి పేదలకు పంచితే – కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టి పెద్దలకు ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు ,చల్ల హరిశంకర్, అర్ష మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement