Thursday, April 25, 2024

తెలుగు అకాడమీ టీడీపీ అకాడమీ కాదు

తెలుగు భాషాభివృద్ధిని విస్తృతం చేసేందుకే తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన  జీవో 31ని విడుదల చేశామన్నారు. తెలుగు భాషాభివృద్ధిని విస్తృతం చేసేందుకే కేబినెట్​లో చర్చించి తెలుగు – సంస్కృత అకాడమీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావటం లేదని చెప్పారు.

మాతృభాషపై పరిశోధన, అభివృద్ధి చేయాలనే సంస్కృతి భాషను కూడా జోడించామన్నారు. తెలుగు భాషపై ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలుగు అకాడమీ టీడీపీ స్థాపించిన అకాడమీ అని చంద్రబాబు మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు.

1968 లో తెలుగు అకాడమీ ప్రారంభమైందన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు దీనిని ఏర్పాటు చేశారని గుర్తు చేవారు. చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీ అస్థిత్వాన్ని కోల్పోయిందన్నారు. సంస్కృతం భారతీయ భాషలకు మూలం అని, దీని ప్రభావం తెలుగుపై చాలా ఎక్కువ అని పేర్కొన్నారు. రెండు భాషలు వేర్వేరుగా చూడలేమన్నారు. తెలుగు భాష మూలాలను తెలుసుకోవాలంటే పరిశోధన అవసరమన్నారు. తెలుగు అకాడమీ ఆస్తుల పంపకంపై తెలంగాణతో చర్చించామని వెల్లడించారు. విభజన చట్టం మేరకు రూ.200 కోట్ల వరకు నిధులు రావాలని తెలిపారు. 40 లక్షల మంది విద్యార్థులకు తెలుగు నిఘంటికను పంపిణీ చేశామన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement