Thursday, April 18, 2024

సైనిక స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మంలో అరుణాచ‌ల్ గ‌వ‌ర్న‌ర్..సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

చంగ్లాంగ్ జిల్లా రాజ్ పుత్ రెజ్మింట్ 14వ బెటాలియ‌న్ లో సైనిక స‌మ్మేళనం కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి అతిథిగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బ్రిగేడియ‌ర్ బి.డి.మిశ్రా హాజ‌ర‌య్యారు. 1962లో దేశానికి బలమైన నాయకత్వం ఉండుంటే చైనా నుంచి దురాక్రమణను భారత ఎదుర్కొనేది కాదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారాయ‌న‌. దేశం తన రక్షణను ఎప్పుడూ తగ్గించుకోకూడదన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సాయుధ దళాలలో భారతదేశం ఒకటి.. అయితే, మన కాపలాదారులను మనం తగ్గించకూడదు.. ప్రతి సైనికుడు మన సరిహద్దుల్లో ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రం సైనికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. ‘భద్రతా బలగాల పట్ల ప్రభుత్వ వైఖరిలో పెనుమార్పు కనిపిస్తోంది.. ఇప్పుడు అత్యున్నత రాజకీయ నాయకత్వం భద్రతా సిబ్బంది శ్రేయస్సు గురించి చాలా ఆందోళన చెందుతుంద‌న్నారు.14వ బెటాలియన్, సైనికుల నైపుణ్యాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement