Friday, February 3, 2023

తెలంగాణ‌లో రూ.16వేల కోట్ల‌తో మెగా మైక్రో సాఫ్ట్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాప్ట్‌ సంస్థ హైదరాబాద్‌లో కార్యకలాపాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. రూ.16 వేల కోట్లతో మరో మూడు డేటా కేంద్రాల ఏర్పాటు-కు అంగీకారం తెలిపింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులో పాల్గొన్న తెలంగాణ ఐటీ- మంత్రి కేటీ- రామారావు సమక్షంలో మైక్రోసాప్ట్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. రాష్ట్రానికి పెట్టు-బడులను ఆకర్షించడమే ధ్యేయం గా తెలంగాణ ఐటీ-, పరిశ్రమల మంత్రి దావోస్‌లో వరుసగా పలు కంపెనీల సీఈవోలు, వ్యాపార దిగ్గజాలతో వరుసగా భేటీ- అవుతున్నారు. ఈ క్రమం లోనే మైక్రోసాప్ట్‌ కేఫ్‌లో ఐటీ-, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీ-ఆర్‌, ఐటీ- ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, మైక్రోసాప్ట్‌ ఆసియా అధ్యక్షుడు అహ్మద్‌ మజర్‌తో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మరో మూడు డేటా సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు- చేయనున్నట్లు- మైక్రోసాప్ట్‌ ప్రకటిం చింది.

- Advertisement -
   

ఒక్కో సెంటర్‌లో 100 మెగావాట్ల ఐటీ- లోడ్‌తో డాటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. గత ఏడాది ఈ కంపెనీ మూడు డేటా కేంద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు- చేయనున్నట్లు- ప్రకటించింది. దీంతో మొత్తం కేంద్రాల సంఖ్య ఆరుకు చేరనున్నది. ఇందులో ఒక్కో డేటా సెంటర్‌ సగటు-న వంద మెగావాట్ల ఐటీ- లోడ్‌ను అందిస్తోందని మైక్రోసాప్ట్‌ తెలిపింది. దశల వారీగా ఆరు డేటా సెంట్లర్ల ఏర్పాటు- లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు- వెల్లడించింది. ఈ డేటా సెంటర్‌లు భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అజూర్‌ కస్టమర్‌లకు సేవలందించేందుకు తన క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయాలని మైక్రోసాప్ట్ భావిస్తున్నది. వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో మొత్తం ఆరు డేటా సెంటర్లను దశలవారీగా ఏర్పాటు- చేయనున్నది. నైపుణ్యం, ఇంటర్న్‌ షిప్‌ ప్రోగ్రామ్స్‌, క్లౌడ్‌ అడాప్షన్‌ వంటి అనేక ప్రయోజనకరమైన కార్యకలాపా లను ప్రారంభించడానికి తెలంగాణ గతంలో మైక్రోసాప్ట్‌nతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మైక్రోసాప్ట్‌ నిర్ణయంపై కేటీ-ఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు- కోసం భారీ పెట్టు-బడులు మైక్రోసాప్ట్‌ తెలంగాణలో డేటా సెంటర్ల కోసం భారీగా పెట్టు-బడులు పెట్టడం సంతో షంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో మైక్రోసాప్ట్‌ అభివృద్ధిని కొనసాగించాలని నేను ఎదురుచూస్తున్నా నన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్లలో హైదరాబాద్‌ ఒకటని, నగరంలో పెట్టు-బడులు పెట్టడం కొనసాగిస్తామని మైక్రోసాప్ట్‌ ఏషియా ప్రెసిడెంట్‌ అహ్మద్‌ మజారీ తెలిపారు. డేటా సెంటర్లతో పాటు- ప్రత్యేక ప్రాజెక్టులను గుర్తించి వాటిని అమలు చేయ డంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మైక్రోసాప్ట్‌ పనిచే స్తుందని మైక్రోసాప్ట్‌ ఆసియా అధ్యక్షుడు అహ్మద్‌ మజర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేప బిలిటీస్‌ కేంద్రాన్ని ఏర్పాటు- చేయనున్నట్లు- వెబ్‌పీటీ- సంస్థ పేర్కొంది. ఈ మేరకు కేటీ-ఆర్‌ సమక్షంలో వెబ్‌పీటీ- సంస్థ ఒప్పందం కురింది. ఈ సంస్థ అమెరికాలోని ఫీనిక్స్‌ కేంద్రంగా పని చేస్తున్నది. రూ.150 కోట్లతో హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ ఏర్పాటు-కు సంసిద్ధత తెలిపింది. వైద్య సంస్థలకు ఔట్‌ పేషెంట్‌, రీహాబిలిటేషన్‌ థెరపీలో డిజిటల్‌ సేవలను సంస్థ అందిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement