Monday, March 27, 2023

Breaking: శంషాబాద్ ఎయిర్​పోర్టు దాకా మెట్రో రైలు.. సెకండ్ ఫేజ్ ప‌నుల‌కు డిసెంబ‌ర్ 9న శంకుస్థాప‌న‌

మెట్రో సెకండ్ ఫేజ్ ప‌నుల‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు దాకా మెట్రోను విస్త‌రించే ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టారు. దీంతో గ‌చ్చిబౌలి మైండ్ స్పేస్ జంక్ష‌న్ నుంచి శంషాబాద్ వ‌ర‌కు మెట్రో జ‌ర్నీకి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.. ఈ మేర‌కు 31కిలోమీట‌ర్ల మేర చేప‌ట్టే ప‌నుల‌కు రూ. 6,250 కోట్ల వ్య‌యంతో అవుతుంద‌ని అంచ‌నా వేశారు. కాగా, డిసెంబ‌ర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ ఈ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నట్టు మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు.. ఈ విష‌యాన్ని కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement