Monday, April 15, 2024

Hyd | మెట్రో షాకింగ్ న్యూస్‌.. టాయిలెట్​ వాడుకుంటే యూజర్​ చార్జీలు

హైద‌రాబాద్ ప్ర‌యాణికులకు మెట్రో షాక్​ల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే రాయితీలను కుదించ‌డంతో చాలా మంది ప్రయాణికులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకుండా మ‌రో అంశంపై మెట్రో సీరియస్​ డిసిషన్​ తీసుకున్నట్టు తెలేస్తోంది. మెట్రో స్టేషన్ లలో ఇప్పటిదాకా ఉచితంగా వాడుకునే టాయిలెట్స్ పై యూజర్ చార్జీలు విధిస్తూ మరింత భారాన్ని మోపింది. మెట్రో తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

హైద‌రాబాద్ సిటీలో అన్ని మెట్రో స్టేషన్లలో ఇప్పటి వరకు ఉచితంగానే టాయిలెట్లను వినియోగించుకొనే సదుపాయం ఉంది. వివిధ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు మెట్రో రైల్ ప్రయాణ సదుపాయంలో భాగంగానే టాయిలెట్లను వినియోగించుకున్నారు.

లేటెస్ట్‌గా హైదరాబాద్ మెట్రో రైల్ L&T సంస్థ ప్రయాణికులపై యూజర్ చార్జిల పేరుతో భారాన్ని మోపింది. టాయిలెట్ల వినియోగానికి 2-5 రూపాయలు వసూలు చేస్తున్నారు. మూత్రవిసర్జనకు 2, మరుగుదొడ్ల వినియోగానికి 5 రూపాయ‌ల‌ చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ టాయిలెట్ల నిర్వహణ బాధ్యతతను సులభ్ కాంప్లెక్స్ వారికి అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ఉన్న స్టేషన్లలో చార్జీలు వసూలు చేస్తుండగా.. మరో రెండు రోజుల్లో ఉప్పల్ రాయదుర్గం, జేబీఎస్- ఎంజీబీఎస్ కారిడార్లలోని అన్ని స్టేషన్లలో యూజర్ చార్జీలను వ‌సూలు చేసేందుకు చర్యలు చేప‌ట్టునున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement