Thursday, April 25, 2024

నెల్లూరు జిల్లాలో యువతిపై దాడి చేసిన శాడిస్ట్ అరెస్ట్

నెల్లూరు జిల్లాలో నిర్జన ప్రదేశంలో ఒక యువతిపై దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి యువతిని చెంపపై కొడుతూ, కర్రతో కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ పిడిగుద్దులు గుద్దుతూ హింసిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆయువతి వదిలేయమని ఎంత ప్రాధేయపడినా యువతిని హింసిస్తూ దానిని మరో ఫ్రెండ్ తో వీడియో తీయించాడు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈక్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

నెల్లూరు జిల్లా రామకోటయ్యనగర్ కు చెందిన ఉష అనే యువతి పట్ల వెంకటేష్ అనే వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. వెంకటేష్‌ను నమ్మి నిర్జన ప్రదేశానికి వెళ్లిన ఉషను కర్రతో, చేతులతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె గాజులు పగిలి.. రక్తం కారుతూ..వదిలేయమని ప్రాధేయపడినా కనికరం చూపలేదు. ఈ అమానుషాన్నంతా తన మిత్రుడితో వీడియో తీయించి పైశాచికానందాన్ని పొందాడు.

https://www.youtube.com/watch?v=6mgm-MHoth4
Advertisement

తాజా వార్తలు

Advertisement