Wednesday, April 24, 2024

త‌గ్గ‌ని కేజీఎఫ్2 జోరు – మెహ‌బూబా ఫుల్ వీడియో సాంగ్

కేజీఎఫ్2 చిత్రం అన్ని భాష‌ల్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రం స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. కలెక్ష‌న్ల‌లో ఖాన్‌, క‌పూర్‌ల‌ను సైతం వెన‌క్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం హిందీలో రూ.410 కోట్లకు పైగా వ‌సూళ్ళు చేసి రికార్డులు సృష్టిస్తుంది. కేజీఎఫ్2 చిత్రం నుండి మెహ‌బూబా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుద‌లైన ప్ర‌తి భాష‌లో వ‌సూళ్ళ వ‌ర్షాన్ని కురిపిస్తుంది. ఈ సినిమా ఇంత‌ పెద్ద విజ‌యం సాధించ‌డంలో సంగీత ద‌ర్శ‌కుడు ర‌వి బస్రూర్ ముఖ్య పాత్ర వహించారు. ఈయ‌న కంపోజ్ చేసిన పాటలు, నేప‌థ్య సంగీతం సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలోని ‘మెహ‌బూబా’ వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. రొమాంటిక్ మెలోడియ‌స్‌గా సాగే ఈ పాట లిరిక‌ల్ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇక ఇప్పుడు వీడియో సాంగ్ విడుద‌ల‌డంతో శ్రోత‌లు ఖుష్ అవుతున్నారు. ఈ చిత్రంలో య‌ష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌, ర‌వీనా టాండ‌న్‌, రావు ర‌మేష్ కీల‌క‌పాత్రల్లో న‌టించారు. బిగ్గెస్ట్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ నిర్మించారు.చిత్రం విడుద‌లై 25రోజులు దాటిన‌ క‌లెక్ష‌న్లలో మాత్రం జోరు త‌గ్గ‌డం లేదు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement