Saturday, March 25, 2023

చంట‌బ్బాయ్ క్యారెక్ట‌ర్ – అల్లు అర్జున్ బాగా చేస్తార‌న్న చిరంజీవి

ఆచార్య ప్ర‌మోష‌న్స్ జోరుగా కొన‌సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి .. చరణ్ .. కొరటాల బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా టీమ్ ను దర్శకుడు హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేశాడు. ‘చరణ్ కాకుండా మీ దృష్టిలో మంచి డాన్సర్స్ ఎవరు? అనే ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ .. “వాళ్లూ వీళ్లూ అని కాదండీ.. ఈ రోజున చాలా మంది చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. వీళ్లల్లా నేను చేయగలనా అనే స్థాయిలో తారక్ .. అల్లు అర్జున్ .. రామ్ .. నితిన్ చేస్తున్నారు. అందరూ కూడా అత్యద్భుతంగా చేస్తున్నారు. ఈ జనరేషన్ హీరోల్లో ‘చంటబ్బాయ్’ సినిమాను ఎవరు చేస్తే బాగుంటుందనే ప్రశ్నకి చిరంజీవి స్పందిస్తూ .. “బన్నీ బాగా చేస్తాడు. కామెడీ టచ్ ఉన్న ఇలాంటి రోల్స్ ను తను బాగా చేయగలడ‌ని చెప్పారు. ‘మీరు ఒక్కసారి గా చరణ్ లా మారిపోతే చిరంజీవిగారిని ఏం అడుగుతారు’ అనే ప్రశ్నను కొరటాలను హరీశ్ అడగ్గానే, చిరంజీవి జోక్యం చేసుకుంటూ ‘నా ఆస్తి పేపర్లు అడుగుతారు’ అంటూ నవ్వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement