Saturday, April 20, 2024

‘మెఘా’ మరో ఘనత.. షెడ్యూల్ కంటే ముందే టన్నెల్ నిర్మాణం..

ప్ర‌భ‌న్యూస్ : నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) మరో ఘనత సాధించింది. జమ్మూకశ్మీర్‌ లడ్డాఖ్‌ ప్రాంతంలో ఆల్‌ వెదర్‌ జోజిలా టన్నెల్‌ నిర్మాణంలో ఎంఇఐఎల్‌ బృందం పురోగతి సాధించింది. క్లిష్టపరిస్థితులలో నీరు ఇంకిపోతూ కష్టతరంగా ఉన్నప్పటికీ షెడ్యూల్‌ కంటే ముందే టన్నెల్‌ 1లో 472 మీటర్ల ట్యూబ్‌ తవ్వకాన్ని పూర్తిచేసింది. ఎంఇఐఎల్‌ సంస్థ 2020 అక్టోబర్‌ 1 నఈపీసీ మోడ్‌లో కాశ్మీర్‌ లోయను లడ్డాఖ్‌కు అనుసంధానించే ఆల్‌ వెదర్‌ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌ (జోజిలా ప్రాజెక్టు) ను అందుకుంది. ప్రాజెక్టు మొత్తం పొడవు 32 కిలోమీటర్లు కాగా, రెండు విభాగాలుగా విభజించారు. ప్రాజెక్టు మొదటి భాగం 18 కిలోమీటర్లు సోనామార్గ్‌….తాల్తాల్‌ను కలుపుతుంది. దీనిలో ప్రధాన వంతెనలు, జంట సొరంగాలున్నాయి. టన్నెల్‌ టిఐ, రెండు ట్యూబులను కలిగి ఉన్న నిర్మాణం.

ఇందులో (ట్యూబ్‌ 1 పి2, పి.4) 448 మీటర్లు, ట్యూబ్‌ 1 నవంబర్‌ 4 న దీపావళి శుభ సందర్భంగా పూర్తయింది. అదే విధంగా 2 వ ట్యూబ్‌ సోమవారం పూర్తి చేసుకుంది.యాక్సెస్‌ రోడ్ల నిర్మాణం తర్వాత మే మాసంలో ఎంఇఐఎల్‌ ప్రాజెక్టు పనిని ప్రారంభించింది. హిమాలయాల గుండా టన్నెలింగ్‌ పని, కానీ చక్కని ప్రణాళికతో సమయ షెడ్యూల్‌ సిద్దం చేసుకుని భద్రతా, నాణ్యతలతో పాటు వేగంగా అత్యున్నతను పాటిస్టూ రెండు సొరంగాల తవ్వకాలను పూర్తి చేసింది. తర్వాత 2 కిలోమీటర్ల పొడవు ఉంటే జంట ట్యూబ్‌ల నిర్మాణ పనుల్లో సంస్థ బృందం నిమగ్నమైంది.

ఈ పనులను ఏప్రిల్‌ కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఈ పనులు ఇప్పటికే వేగవంతంగా కొనసాగుతున్నాయని సంస్థ పేర్కొంది. ఇక 13.3 కిలోమీటర్ల పొడవున్నజోజిలా మెయిన్‌ టన్నెల్‌ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని తెలిపింది. ఎంఇఐఎల్‌ సంస్థ లడ్డాఖ్‌ నుంచి 600 మీటర్లు, కశ్మీర్‌ వైపు నుంచి 300 మీటర్ల పనులను ముందుగానే సాధించిందని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement