Friday, April 26, 2024

ప్లిప్ కార్ట్ లో వైద్య సేవ‌లు..

ప్లిప్ కార్ట్ ఇది ఆన్ లైన్ సంస్థ అని అంద‌రికీ తెలిసిందే..దీనిలో ఎన్నో ర‌కాల వ‌స్తువులు, షాపింగ్ కి కావ‌ల్సిన స‌రుకులు ల‌భిస్తుంటాయి..ఒక‌టో రెండో వ‌స్తువులు త‌ప్పా..ఆల్ మోస్ట్ అన్ని వ‌స్తువులు ఈ కామ‌ర్స్ సంస్థ‌లో ల‌భ్య‌మ‌వుతుంటాయి. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు షాపింగ్ కోస‌మే ఉప‌యోగించిన ఈ ప్లిప్ కార్ట్ ఇక‌పై హెల్త్ ప్ల‌స్ సేవ‌ల‌ను అందించ‌నుంది. ఈ మేర‌కు స‌స్తా సుంద‌ర్ మార్కెట్ ప్లేస్ అనే ఆన్ లైన్ ఫార్మ‌సీ సంస్థ నుంచి మెజారీటి వాటాను కొనుగోలు చేసింది.భవిష్యత్తులో ఈ-డయాగ్నెస్టిక్స్​, ఈ-కన్సల్టేషన్​ల సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. సస్తాసుందర్​.కామ్.. డిజిటల్​ హెల్త్​కేర్​, ఫార్మసీ రంగానికి సంబంధించి 490 ఫార్మసీల నెట్​వర్క్​తో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోందని ఫ్లిప్​కార్ట్​ వెల్లడించింది. ‘ఫ్లిప్​కార్ట్​ హెల్త్​ +’, ఇప్పుడు సస్తాసుందర్​ సహా ఫ్లిప్​కార్ట్​ నెట్​వర్క్​లను ఉపయోగించుకుని ఈ-ఫార్మసీ రంగంలో మెరుగైన సేవలు అందించనుందని సంస్థ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement