Thursday, April 25, 2024

మెద‌క్ ఎమ్మెల్సీ అభ‌ర్య‌ర్థిగా జ‌గ్గారెడ్డి భార్య నిర్మ‌ల‌గౌడ్..!

కాంగ్రెస్ త‌న హ‌వాని చాటేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రెండు స్థానాల్లో పోటీ చేయ‌నుంది. మెద‌క్ నుంచి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి భార్య నిర్మ‌ల గౌడ్ నిల‌బ‌డే ఛాన్స్ ఉంది. ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరపున రాయల నాగేశ్వరరావు దిగబోతున్నారు. వీరిద్దరి పేర్లను సూచిస్తూ అధిష్టానానికి టి.కాంగ్రెస్ పంపించింది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీ ఫామ్ అందించనున్నారు.కాగా మధ్యాహ్నం జగ్గారెడ్డి భార్య నిర్మల గౌడ్ నామినేషన్ వేయనున్నారు. మిగతా స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. నిజామాబాద్, నల్గొండ, వరంగల్ లోనూ పోటీ చేయలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే పోటీ చేయడానికి కాంగ్రెస్ నేతలు ముందుకు రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement