Thursday, April 25, 2024

మావోల చెరలో జవాన్ సేఫ్.. రాకేశ్వర్ సింగ్ ఫోటో విడుదల!

ఛత్తీస్గఢ్ లోని బీజాపుర్ లో జరిగిన దాడి తర్వాత మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న జవాను రాకేశ్వర్ సింగ్ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఫొటోను మావోయిస్టులు విడుదల చేశారు. చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్ ను వదిలేస్తామని స్పష్టం చేశారు. చర్చలు జరగనంత వరకూ రాకేశ్వర్ సింగ్.. తమ దగ్గర సురక్షితంగా బందీగా ఉంటాడని లేఖలో పేర్కొన్నారు. తమ షరతులను అంగీకరించేంత విడుదల చేయడం కుదరదంటూ స్పష్టం చేశారు. మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట లేఖ విడుదల చేశారు. ప్రభుత్వంతో చర్చలకు తామెప్పుడు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

మరోవైపు రాకేశ్వర్ విడుదలపై ప్రభుత్వం జాప్యం చేస్తోందని.. ఎలాంటి చర్యలు తీసుకోడం లేదంటూ ఆయన కుటుంబం ఆరోపించింది.  కాగా,  ఛత్తీస్‌గడ్‌లోని బీజపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 24 మంది జవాన్లు మృతి చెందారు. 31 మంది జవాన్లు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన అనంతరం జవాన్ల నుంచి మావోయిస్టులు ఆయుధాలను ఎత్తుకెళ్లారు. మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిద్మా నాయకత్వంలో ఈ దాడి జరిగింది. మందుపాతర పేల్చి.. ఆ తర్వాత పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement