Friday, April 19, 2024

Spl Story: ట్రాన్స్​విమెన్​తో లవ్​ ఎఫైర్​, నిలదీసిన భార్య​.. ఆ తర్వాత ఏమైందంటే!

అప్పటికే అతనికి పెళ్లయ్యింది. రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. ఆ 32 ఏళ్ల వ్యక్తి ట్రాన్స్​ విమెన్​ను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ఇక ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆమె ఫోన్​ నెంబర్​ తీసుకుని చాలా రోజులుగా చాటింగ్​, మాట్లాడ్డం చేస్తున్నాడు. ఈ విషయం కాస్త అతని భార్యకు తెలిసింది. ఆ తర్వాత ఏమైందంటే..

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

ఒడిశాలోని కలహండి జిల్లా నార్లాలో ఓ 32 ఏళ్ల వ్యక్తి వీధుల్లో భిక్షం అడుక్కుంటున్న ఓ ట్రాన్స్​విమెన్​ని చూశాడు. ఇక ఆమెను చూసిన మరుక్షణమే లవ్​లో పడ్డాడు. తన నెంబర్​ తీసుకుని చాలా రోజులుగా చాటింగ్స్​, ఫోన్​ కాల్స్​ చేస్తూ వచ్చాడు. తనను ప్రేమిస్తున్నానని, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. అయితే చాలా కాలంగా ఇంట్లో తన భార్యకు తెలియకుండా జరుగుతున్న ఈ ప్రేమాయణం కాస్త ఓ రోజు తన భార్య చెవిన పడింది. ఇంకేముంది ఈ విషయంలో వారిమధ్య ఒక యుద్ధం జరిగిందనే చెప్పవచ్చు. అయితే.. తను లేకుండా బతకలేనని, తనను పెళ్లి చేసకుంటానని భార్యకు నచ్చజెప్పాడు.

భర్త అంతగా ప్రేమిస్తున్న ఆ ట్రాన్స్​ విమెన్​తో పెళ్లి జరిపిస్తేనే బాగుంటాడని అనుకున్న ఆ ఇల్లాలు.. వారిద్దరి పెళ్లికి ఒప్పుకుంది. ఈ మధ్యనే ఒక ఆలయంలో ఆ ట్రాన్​ విమెన్​ని పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ఇదంతా తన భార్య పర్మిషన్​తో, ఆమె సమక్షంలోనే జరిగింది. ఆమె వారి వివాహాన్ని అంగీకరించడమే కాకుండా ట్రాన్స్ విమన్‌తో ఒకే ఇంట్లో ఉండడానికి అంగీకరించింది. భార్య మంచితనాన్ని పొగుడుతూ చాలామంది సోషల్​ మీడియాలో పెడుతున్న కామెంట్స్​ హల్​చల్​ అవుతున్నాయి.. ముఖ్యంగా ఆ వ్యక్తికి –రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

ఇక..- గత సంవత్సరం రాయగడ జిల్లాలోని అంబడోల వద్ద ఓ వీధిలో భిక్షాటన చేస్తున్న ట్రాన్స్ విమన్‌ను చూశాడు. అతనికి మొదటి చూపులోనే ఆమెపై ఇష్టం కలిగింది. లవ్​ ఎట్​ ఫస్ట్​ సైట్​ అన్నట్టు​ ఆ  ట్రాన్స్ విమెన్ మొబైల్ నంబర్ తీసుకుని ఆమెతో టచ్ లో ఉన్నాడు. కాగా, ఒక నెల క్రితం ఆ వ్యక్తి భార్యకు ట్రాన్స్ విమన్‌తో నిత్యం చేసే సంభాషణల గురించి తెలుసింది.

- Advertisement -

ఈ విషయమ్మీద వారిద్దరి మధ్య కాస్త గట్టి వాదనలే జరిగాయి. ఆ వ్యక్తి ట్రాన్స్ విమన్‌తో రిలేషన్​లో ఉన్నట్టు అంగీకరించాడు. అతని దీనిపై సీరియస్‌గానే చెబుతున్నాడని గ్రహించిన అతని భార్య తన కుటుంబంలోకి ట్రాన్స్ విమన్‌ను తీసుకురావడానికి అంగీకరించింది. ఇక.. తన భార్య ఆమోదం తర్వాత నార్లలోని ఒక దేవాలయంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యులతో సహా.. పరిమిత అతిథుల సమక్షంలో జరిగిన చిన్న ఫంక్షన్‌లో ఆ వ్యక్తి ట్రాన్స్ విమన్‌తో తన వివాహాన్ని ఘనంగా జరుపుకున్నాడు.

ఇదిలావుండగా.. హిందూ కుటుంబంలో స్త్రీ లేదా లింగమార్పిడి చేసుకున్న వ్యక్తితో రెండో వివాహం భారతీయ చట్టం ప్రకారం అనుమతించరని ఒడిశా హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ మొహంతి తెలిపారు. రెండో వివాహం జరిగితే.. అది చెల్లదు. భారతీయ చట్టం ప్రకారం శిక్షార్హమైన చర్య అని మొహంతి అన్నారు. ఒక వ్యక్తి తన మొదటి భార్య ఉన్నప్పుడే రెండో పెళ్లి  చేసుకుంటే హిందూ చట్టం మొదటి వివాహాన్ని ‘జీవనాధారం’గా పేర్కొంటుందన్నారు.  

కాగా, వీరిద్దరి వివాహాన్ని నిర్వహించడంలో ముందున్న ఏరియాలోని ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ అధ్యక్షురాలు కామిని మాట్లాడుతూ పెళ్లి తర్వాత తాము కూడా ఈ వివాహం గురించి పోలీసు స్టేషన్‌కు వెళ్లామని తెలిపారు. ఇటువంటి సంఘటనపై (ట్రాన్స్ జెండర్ వివాహం) బాధిత పక్షం ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని నార్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అయితే కొత్త జంటపై యూనియన్ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. దీనిపై తన భార్య కూడా సంతోషంగా ఉందని, చట్టం గురించి ఆందోళన లేదని పెళ్లి చేసుకున్న వ్యక్తి చెప్పాడు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement