Thursday, May 19, 2022

మళ‌యాళ స్టార్ న‌టుడు ‘మ‌మ్ముట్టి’కి క‌రోనా

ఇప్ప‌టికే ఎంతో మంది సినీ సెల‌బ్రిట్రీల‌కి క‌రోనా సోకింది. రీసెంట్ గా మ‌ళ‌యాళ స్టార్ న‌టుడు మ‌మ్ముట్టి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. “అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిన్న నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కొంచం జ్వరంతో ఉన్నాను. నేను బాగానే ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు నేను ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎల్లవేళలా మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండి” అని ట్వీట్ చేశారు. మమ్ముట్టి కరోనా బారిన పడ్డారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ‘గెట్ వెల్ సూన్ సార్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement