Friday, May 20, 2022

మ ..మ.. మ‌హేశా సాంగ్ కి రెండు రోజుల్లో – 20మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్

ఈ మ‌ధ్య‌కాలంలో సినిమాల‌కంటే ఆ చిత్రాల్లోని సాంగ్స్ కే విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డుతోంది. కాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు..కీర్తి సురేశ్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్రంలోని సాంగ్స్ కి విప‌రీత‌మైన క్రేజ్ వ‌స్తోంది. ఇప్ప‌టికే కళావతి’ సాంగ్ .. ‘ పెన్నీ’ సాంగ్ ఒక రేంజ్ లో జనంలోకి వెళ్లాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘మ మ మహేశా’ సాంగును రిలీజ్ చేయగా కొత్త రికార్డులను నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది. రెండు రోజుల్లోనే ఈ పాట 20 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టడం విశేషం. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. ఈ నెల 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించడమే కాదు, ఆయన పాత్రకి రొమాంటిక్ టచ్ ఎక్కువగా ఉండనుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మైత్రీ – 14 రీల్స్ సంస్థలు నిర్మించాయి. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement