Wednesday, April 24, 2024

బాలీవుడ్ పై మ‌హేశ్ బాబు కామెంట్స్ – స్పందించిన రామ్ గోపాల్ వ‌ర్మ‌

టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్య‌లో అర్థం ఏంటో నిజాయితీగా అర్థం కాలేద‌న్నారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. బాలీవుడ్ పై నటుడు మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో భాగంగా మహేశ్ బాబు.. బాలీవుడ్ లో నటించడంపై ప్రశ్న ఎదుర్కొన్నారు. తనకు హిందీ పరిశ్రమ నుంచి ఎక్కువ అవకాశాలు రాలేదని, తనను బాలీవుడ్ భరించలేదని (రెమ్యునరేషన్ అయి ఉండొచ్చు) ఆయన బదులిచ్చారు. ఈ వ్యాఖ్యల పట్ల బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ స్పందించారు. మహేశ్ బాబు వ్యాఖ్యల్లోని మర్మమేంటో తనకు అర్థం కాలేదన్నారు. ‘‘ఒక నటుడిగా అది అతడి ఎంపిక అని అన్నాడు. ఇటీవల దక్షిణాది సినిమాలను గమనించినట్టయితే.. అవి హిందీలోకి డబ్బింగ్ అయి విడుదలయ్యాయి. వారు ఖర్చు చేసిందంతా వెనక్కి వచ్చేసింది. బాలీవుడ్ ఒక కంపెనీ కాదు. మీడియా ఇచ్చిన లేబుల్ మాత్రమే. విడిగా ఒక మూవీ కంపెనీ లేదా నిర్మాణ సంస్థ ఇంత బడ్జెట్ తో నటించాలని అనుకోవ‌చ్చు. కనుక బాలీవుడ్ ను సాధారణీకరించి ఎలా చెప్తారని రామ్ గోపాల్ వర్మ ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement