Saturday, April 20, 2024

బండి యాత్రతో తెలంగాణలో మార్పుః మహారాష్ట్ర మాజీ సీఎం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తెలంగాణలో మార్పు తీసుకువస్తుందని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.  తెలంగాణ సీఎం కేసీఆర్.. కేవలం తన కుటుంబం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారని ఆయన ఆరోపించారు. వికారాబాద్ జిల్లాలోని శివారెడ్డి పేటలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్రలో ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో కేసీఆర్‎కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైందన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్‎లో కూర్చొని మాట్లాడితే.. బండి సంజయ్ మాత్రం రైతుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నారని చెప్పారు.

సీఎం ఫాంహౌజ్‎లో కూర్చొని పథకాలను రచించి ఏ విధంగా దోపిడీ చేయాలో ప్రణాళిక రూపొందించి దోచుకుంటున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అనేక సబ్సిడీలను నిలిపేశారని మండిపడ్డారు. ధరణిని అమలు చేయడం లేదన్న ఫడ్నవీస్.. రుణమాఫీ పూర్తిగా ఇవ్వడంలేదన్నారు. రైతుల ప్రభుత్వం, ప్రజాస్వామిక సర్కార్ రావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. బండి సంజయ్ పాదయాత్రను ఆశీర్వదించాలని ఫడ్నవీస్ కోరారు.

ఇది కూడా చదవండిః కాంగ్రెస్ లో ఉంటూ వెన్నపోటు పొడవద్దు: కోమటిరెడ్డిపై మధుయాష్కీ ఫైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement