Tuesday, April 23, 2024

Dasara Dhamaka: సామాజిక రుగ్మతలపై ‘గీతా’స్త్రం.. ఇలా ట్యూన్​ చేస్తారనుకోలేదు మహాప్రభో!

కత్తికంటే కలం గొప్పదంటారు.. అయితే పేజీలకు పేజీలు చదివినా అర్థంకాని విషయాన్ని ఒక్క గీత గీసి చెప్పొచ్చంటున్నారు నేటితరం కార్టూనిస్టులు. ఎందుకంటే.. సందర్భం ఏదైనా కానీ, పండుగులు, పబ్బాలు, సంబురాలు, సందడి ఏదైనా సరే.. కార్టూన్లు లేనిదే పత్రికలకు ఆ మజా రాదు. అందుకని ఒక్కో పత్రిక ఒక్కో విధంగా కార్టూన్లకు ఇంపార్టెన్స్​ ఇస్తుంది. ఇక.. చారిత్రక నేపథ్యం ఉన్న ఆంధ్రప్రభ దినపత్రిక అయితే.. నిత్యం కార్టూన్లకు పెద్దపీట వేస్తుంది.

మరి. ఈ సారి ఆంధ్రప్రభ గీతచార్యుడు, నల్లాన్ చక్రవర్తుల మధుసూదనాచార్యులు ఎట్లాంటి అంశాలను బేస్​ చేసుకుని మనకు ముందుకు వస్తున్నారో ఈ కార్టూన్లను చూసి తెలుసుకోవచ్చు. ఎక్కువగా సామాజిక అంశాల ఆధారంగా​, ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న బాధలను తన కార్టూన్లలో పొందుపరిచారు. అంతేకాకుండా ఫన్నీగా ఉండేలా.. ప్రజలకు ఈజీగా అర్థం అయ్యేలా రూపొందించారు. ఇక.. దసరా పండుగవేల మీరూ వీటిని చూసి కాసేపు నవ్వుకోండి.. కామెంట్స్​ రూపంలో మీ విలువైన సలహాలు, సూచనలు తెలియజేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement