Sunday, April 7, 2024

కమల్ హాసన్‌కు ఊరట.. ఆ కేసును కొట్టివేసిన కోర్టు

మ‌హాభార‌తం గురించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కేసులో సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌కు మదురై కోర్టులో ఊరట లభించింది. కమలహాసన్‌పై కేసును కొట్టి వేస్తున్నట్లు కోర్టు చెప్పింది. 2017లో ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్‌ మహాభారతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది అప్పట్లో దుమారం రేపింది. కమల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్‌లై జిల్లా పళైయూర్‌ గ్రామానికి చెందిన ఆదినాథ సుందరం అనే వ్యక్తి వల్లియూర్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆ పిటిషన్‌ను కొట్టి వేయాల్సిందిగా నటుడు కమల్ హాసన్‌ మదురై హైకోర్టును ఆశ్రయించారు.

అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. శుక్రవారం మరోసారి ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో నటుడు కమల్ హాసన్‌ తరఫు న్యాయవాది హాజరై ఇలాంటి వివాదాస్పద సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మాటలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కమల్ హాసన్‌పై కేసును కొట్టి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: ఈటలకు ఝలక్: హుజురాబాద్ పై హరీష్ కొత్త స్కెచ్!

Advertisement

తాజా వార్తలు

Advertisement