Friday, April 19, 2024

కాంగ్రెస్ లో ఉంటూ వెన్నపోటు పొడవద్దు: కోమటిరెడ్డిపై మధుయాష్కీ ఫైర్

మాజీ సీఎం వైఎస్ సంస్మ‌ర‌ణ స‌భ తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. వైఎస్ ష‌ర్మిల పార్టీ కోసం వైఎస్ విజయమ్మ ఏర్పాటు చేసిన సంస్మ‌ర‌ణ స‌భ‌కు ఎవ‌రూ వెళ్లొద్దంటూ టీపీసీసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. స‌భ‌కు వెళ్లిన ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుయాష్కీ గౌడ్ మండిప‌డ్డారు. వైయస్ విజయమ్మ నిర్వహించిన సమ్మేళనంకు కోమటిరెడ్డి వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు.

కోమటిరెడ్డి ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియగాంధీ కారణమని గుర్తు చేశారు. పార్టీ నిర్ణయాన్ని కాదని సమ్మేళనంకు వెళ్లడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే పోవచ్చన్న యాష్కి… పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా విజయమ్మ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. సంస్కారం లేని వాళ్లే ఇలా మాట్లాడతారని మ‌ధుయాష్కీ పేర్కొన్నారు.

కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా  సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని తాను ఈ సమావేశానికి వెళ్తున్నట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశం రాజకీయాలకు అతీతమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఎవరూ వెళ్లోద్దని కాంగ్రెస్ పార్టీ నేతలను ఆదేశించింది. అయినప్పటికీ కోమటిరెడ్డి ఈ సమ్మేళనానికి హాజరవ్వడం కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండిః కాంగ్రెస్ పరువు తీసేది ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement