Friday, March 29, 2024

‘మా’ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలు.. గెలుపు ఎవరికో?

మూవీ అర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు హాట్ హాట్ గా జరగనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు.  జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మా ఎన్నికల కోసం ఏర్పాట్లు చేశారు. రాత్రి 8 గంటల్లోగా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సహాయాధికారి నారాయణరావు వెల్లడించారు.

‘మా’ ఎన్నికల మంచు విష్ణువర్ధన్, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెళ్లు పోటీ చేస్తున్నాయి. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ కు మెగా కుటుంబం మద్దుతు ఇవ్వగా.. మంచు విష్ణుకు కొంత మంది సీనియర్లు సపోర్టు చేస్తున్న ప్రకటించారు. ప్రధానంగా లోకల్ నాన్ లోకల్ నినాదంతో మంచు విష్ణు ప్యానెల్ ఎన్నికల్లో నిలిచింది. మా భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ఇక, ప్రకాశ్ రాజ్ సైతం తమ మేనిఫెస్టోలో వివిధ హామీ ఇచ్చారు. అంతిమంగా ఇద్దరిలో ఎవరు గెలుసారు? అన్నది ఉత్కంఠగా మారింది.

ఇది కూడా చదవండి: మా ఎన్నికల్లో అతన్నే గెలిపించండి: ప్రకాశ్​రాజ్ పై కోటా సంచలన కామెంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement